వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లు తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ 43వ ర్యాంక్, బౌలర్లలో కుల్దీప్ 14వ ర్యాంకు సొంతం చేసుకున్నారు.
విధ్వంసక ఓపెనర్ ఇషాన్ రెండో టెస్టు, మూడు వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ కూడా ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్ మూడు వన్డేలు కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు.
అయితే వన్డే సిరీస్‌లో రెండు, మూడు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి, రోహిత్‌లు ఒక్కో స్థానం కోల్పోయారు. ఇంతకుముందు టాప్ 10లో హిట్‌మ్యాన్ 11వ స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్‌కి పడిపోయారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో గాయంతో వన్డే సిరీస్‌కు దూరమైన మహ్మద్ సిరాజ్ ఒక స్థానం దిగజారి 677 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. 886 పాయింట్లతో బాబర్ ఆజం తొలి స్థానంలో ఉండగా.. వాండర్ డుసెన్ 777 పాయింట్లతో రెండు, 755 పాయింట్లతో ఫఖర్ జమాన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి శుబ్‌మన్ గిల్ 724 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.
ఇక బౌలర్ల విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ 705 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. 686 పాయింట్లతో మిచెల్ స్టార్క్, 682 పాయింట్లతో రషీద్ ఖాన్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత
Comments
Please login to add a commentAdd a comment