ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సత్తాచాటాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో గిల్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. గిల్ నెంబర్ 1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న గిల్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కినెట్టి అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా గిల్ అదరగొడుతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లకు జ్వరం కారణంగా దూరమైన ఈ యువ ఓపెనర్.. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపాడు. ప్రస్తుతం బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 830 రేటింగ్ పాయింట్లతో గిల్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. 824 రేటింగ్ పాయింట్లతో బాబర్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
గిల్ అరుదైన ఘనత..
వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్‌గా అవతరించిన గిల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లలోనే నెం1 ర్యాంక్‌కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా శుబ్‌మన్ రికార్డులకెక్కాడు. గిల్ కేవలం 41 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డును గిల్ సాధించాడు.
కాగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. 2010లో వన్డేల్లో నెం1 బ్యాటర్‌గా నిలిచిన ధోని.. కేవలం 38 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. అదే విధంగా వన్డేల్లో అగ్రపీఠాన్ని అధిరోహించిన నాలుగో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment