ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో దుమ్మురేపుతున్న సిరాజ్.. పాక్ స్పీడ్ స్టార్ షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టి నంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సిరాజ్ ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో మూడు వికెట్లతో సిరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా ఓ కీలక వికెట్ సాధించాడు. కాగా హైదరాబాద్ స్టార్ సిరాజ్ నెం1 ర్యాంక్‌కు చేరుకోవడం ఇది మూడో సారి.
ప్రస్తుతం బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 709 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (694 పాయింట్లు) ఉన్నాడు. అయితే భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న గిల్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి నెం1 స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు.
చదవండి: Ben Stokes: సెంచరీతో అదరగొట్టిన స్టోక్స్.. వరల్డ్‌కప్‌లో ఇదే మొదటిది
Comments
Please login to add a commentAdd a comment