
ICC Men's ODI Batting Rankings: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. స్వదేశంలో శ్రీలంకతో తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ ఇద్దరు క్రికెటర్లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. గువహటి మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ.. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు.
అద్భుత ఇన్నింగ్స్‌తో..
ఇక వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన కోహ్లి.. 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో 45వ సెంచరీ, ఓవరాల్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో 73వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి రెండు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. రోహిత్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా లంకతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే
బాబర్ ఆజం(పాకిస్తాన్)
రాసి వాన్ డెర్ డసెన్ (సౌతాఫ్రికా)
ఇమామ్ ఉల్ హక్(పాకిస్తాన్)
క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా)
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
చదవండి: రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. నా రికార్డు బ్రేక్! థ్రిల్ అయ్యా.. ఎవరికీ అందనంత ఎత్తులో!
Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు
Comments
Please login to add a commentAdd a comment