సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఇటీవలే నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ శతకం (175) బాదిన మార్క్రమ్.. ఏకంగా 13 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ స్థానానికి ఎగబాకాడు. అలాగే ఆల్‌రౌండర్స్ విభాగంలో 16 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి చేరాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో రెండో వన్డేలోనూ అర్ధసెంచరీతో (51 నాటౌట్) రాణించిన మార్క్రమ్.. దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ చేజిక్కించుకోవడంతో పాటు సఫారీ టీమ్ వన్డే వరల్డ్‌కప్-2023కు నేరుగా అర్హత సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.
కెరీర్‌లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 41వ స్థానానికి చేరిన మార్క్రమ్.. వన్డేలతో పాటు టీ20లు, టెస్ట్‌ల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇక ఈ వారం ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. టీమిండియా యువకెరటం శుభ్‌మన్ గిల్‌ఓ స్థానం మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ నాలుగో ర్యాంక్ సాధించగా.. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ ఏకంగా 5 స్థానాలు జంప్ చేసి 10 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. నెదార్లండ్స్‌తో సిరీస్‌లో ఓ ఫైఫర్‌తో పాటు 8 వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ సిసండ మగాలా ఏకంగా 35 స్థానాలు ఎగబాకి 165 ర్యాంక్‌కు చేరుకున్నాడు.
బ్యాటర్ల విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, గిల్, వార్నర్, కోహ్లి, డికాక్, రోహిత్, స్టీవ్ స్మిత్, ఫకర్ జామన్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్డ్, సిరాజ్, స్టార్క్, మ్యాట్ హెన్రీ, రషీద్ ఖాన్, జంపా, షాహీన్ అఫ్రిది, ముజీబ్ రెహ్మాన్, షకీబ్ 2 నుంచి 10 ప్లేస్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ టాప్‌లో కొనసాగుతుండగా.. నబీ, రషీద్ ఖాన్ టాప్-3లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment