దుబాయ్: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్ 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి సేన.. న్యూజిలాండ్(118)ను మూడో స్థానానికి నెట్టి 119 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్ 118 పాయింట్లకు మాత్రమే పరిమితమై మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ చదవండి: ఆ క్యాచ్ హైలెట్.. ఒకవేళ అవి జారవిడవకుండా ఉంటే..!
ఈ జాబితాలో 111 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, 108 పాయింట్లతో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు నిలిచాయి. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని సాధించి ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో చివరిదాకా పోరాడి భారత శిబిరంలో గుబులు పుట్టించిన ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం చేసుకోగా, వరుస అర్ధసెంచరీలతో అలరించిన ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఇక్కడ చదవండి: టీమిండియా టాపార్డర్ తీరుపై వీవీఎస్ అసంతృప్తి!
Comments
Please login to add a commentAdd a comment