క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. పాక్ జట్టు ఈసారి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుండడం 29 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు భావిస్తోంది.
అయితే భారత్ ఆడే మ్యాచ్‌లు మొత్తం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ సెమీఫైనల్, ఫైనల్‌కు చేరినా ఈ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఈవెంట్‌లో పాల్గోనే ఆ దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను సైతం ప్రకటించాయి. ఈ మినీ వరల్డ్‌కప్ కోసం అన్ని దాదాపు అన్ని తమ సన్నాహకాల్లో బీజీబీజీగా ఉన్నాయి. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ట్రైసిరీస్‌లో తలపడుతున్నాయి.
ముహూర్తం ఖరారు..
కాగా మెగా టోర్నీ కోసం భారత జట్టు దుబాయ్ వెళ్లేందుకు ముహర్తం ఖారారైంది. ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుబాయ్‌కు పయనం కానుంది. భారత జట్టు ప్రస్తుతం మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఇప్పటికే రెండు వన్డేల ముగియగా.. ఆఖరి వన్డే బుధవారం(ఫిబ్రవరి 12) జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఈ మెగా టోర్నీలో పాల్గోనేందుకు రోహిత్ సేన వెళ్లనుంది.
అదేవిధంగా స్పోర్ట్స్ టాక్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ప్రతీ ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఆయా జట్లు కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడుతాయి.
తొలుత భారత్ కూడా యూఏఈ లేదా బంగ్లాదేశ్‌తో ఓ వార్మాప్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ జట్ల బీజీ షెడ్యూల్ కారణంగా వార్మాప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఐసీసీకి వీలుపడలేదు. ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment