ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న హిట్‌మ్యాన్.. ఓ ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ వన్డే ర్యాంక్. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు సహా 157 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, రోహిత్ రెండో ర్యాంక్‌కు ఎగబాకడంతో ఆ స్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. లంకతో సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోయనా విరాట్ కోహ్లి నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ ఓ స్థానం మెరుగుపర్చుకుని విరాట్‌తో సమానంగా నాలుగో స్థానానికి చేరుకోగా.. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు.
భారత్‌తో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన లంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరగా.. డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, వాన్ డెర్ డస్సెన్ 6, 7, 9, 10 స్థానాల్లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మొహమ్మద్ నబీ, షాహీన్ అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ సిరాజ్ టాప్-10లో ఉన్నారు. వన్డే ఆల్‌రౌండర్ల విభాగంలో మొహమ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్, సికందర్ రజా టాప్-3లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment