నితీశ్‌ కుమార్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. జోస్‌ బట్లర్‌! వీడియో వైరల్‌ | Nitish Kumar Reddy takes a brilliant diving catch to dismiss well-set Jos Buttler | Sakshi
Sakshi News home page

IND vs AUS: నితీశ్‌ కుమార్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. జోస్‌ బట్లర్‌! వీడియో వైరల్‌

Published Wed, Jan 22 2025 9:29 PM | Last Updated on Thu, Jan 23 2025 9:24 AM

Nitish Kumar Reddy takes a brilliant diving catch to dismiss well-set Jos Buttler

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ సంచ‌ల‌నం నితీశ్ కుమార్ రెడ్డి సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. నితీశ్ అద్బుత‌మైన క్యాచ్‌తో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్ల‌ర్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17 ఓవ‌ర్ వేసిన మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో తొలి బంతిని బ‌ట్ల‌ర్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ త‌ర్వాత వెంట‌నే రెండో బంతిని వ‌రుణ్.. బ‌ట్ల‌ర్‌కు  షార్ట్-పిచ్డ్ డెలివరీ సంధిచాడు.

ఆ బంతిని కూడా లెడ్ సైడ్ దిశ‌గా బ‌ట్ల‌ర్ మ‌రో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. అయితే షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశ‌గా గాల్లోకి లేచింది. ఈ క్ర‌మంలో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి  డైవ్ చేస్తూ స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.  దీంతో బ‌ట్ల‌ర్‌(68) నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో నితీశ్ మొత్తంగా రెండు క్యాచ్‌ల‌ను అందుకున్నాడు. నితీశ్ డైవింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త బౌల‌ర్ల దాటికి కేవ‌లం 132 ప‌రుగుల‌కే ఆలౌటైంది.  భారత బౌలర్లలో వరుణ్‌​ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్‌(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement