
ఇంగ్లండ్‌తో ముగిసిన ఆఖరి వన్డేలో అద్బుత సెంచరీతో చెలరేగిన రిషభ్ పంత్ టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో మెయిడెన్ సెంచరీ అందుకున్న పంత్ తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పంత్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే ఇంగ్లండ్‌పై 55 బంతుల్లో 71 పరుగులు చేసిన పాండ్యా 8 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు.
ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో కెరీర్ బెస్ట్ నమోదు చేసిన పాండ్యా(4/24) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 70వ స్థానానికి చేరుకున్నాడు. ఇక యజ్వేంద్ర చహల్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. గాయంతో ఆఖరి వన్డేకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా తన నెంబర్ వన్ స్థానాన్ని ట్రెంట్ బౌల్ట్‌కు కోల్పోయాడు. తొలి వన్డేలో 6/19తో కెరీర్ బెస్ట్ నమోదు చేసిన బుమ్రా నెంబర్‌వన్ స్థానం ఆక్రమించినప్పటికి.. ఆఖరి వన్డేకు దూరమవడంతో టాప్-2కి పడిపోయాడు.
బ్యాటింగ్ విభాగంలో బాబర్ ఆజం 892 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఇమాముల్ హక్ రెండు, వాండర్ డుసెన్ మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి నాలుగో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ(5వ స్థానం).. తన స్థానాన్ని కాపాడుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, షాహిన్ అఫ్రిది వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లు ఉన్నారు. టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఎనిమిదో స్థానంలో కొనసాగతున్నాడు.
A new No.1!
— ICC (@ICC) July 20, 2022
A busy week in ODI cricket has led to a number of changes in the @MRFWorldwide ICC Men's Player Rankings.
Details 👇
చదవండి: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..!
'కార్లు కాదు పరిగెత్తడానికి.. రిటైర్‌మెంట్‌తోనైనా మేల్కొనండి'
Comments
Please login to add a commentAdd a comment