భారత జట్టును అభినందించిన దాల్మియా! | Jagmohan Dalmiya congratulates team India for clean sweep over Zimbabwe | Sakshi
Sakshi News home page

భారత జట్టుపై దాల్మియా ప్రశంసలు

Published Sun, Aug 4 2013 8:49 PM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

Jagmohan Dalmiya congratulates team India for clean sweep over Zimbabwe

జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ లో ఘన విజయాన్ని దక్కించుకున్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ప్రశంసలతో ముంచెత్తారు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ ను 5-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. 
 
'విదేశీ గడ్డపై క్లీన్ స్పీప్ చేసిన భారత జట్టుకు నా శుభాకాంక్షలు. యువకులతో కూడిన భారత జట్టు విశ్వాసాన్ని నింపింది. పట్టుదలతో ఆడింది' అని దాల్మియా ఓ ప్రకటనలో తెలిపారు. 
 
బులవాయోలో జరిగిన ఐదవ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో 5-0 తేడాతో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే జట్టుపై విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో భారత జట్టు నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement