భారత జట్టును అభినందించిన దాల్మియా!
జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ లో ఘన విజయాన్ని దక్కించుకున్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ప్రశంసలతో ముంచెత్తారు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ ను 5-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
'విదేశీ గడ్డపై క్లీన్ స్పీప్ చేసిన భారత జట్టుకు నా శుభాకాంక్షలు. యువకులతో కూడిన భారత జట్టు విశ్వాసాన్ని నింపింది. పట్టుదలతో ఆడింది' అని దాల్మియా ఓ ప్రకటనలో తెలిపారు.
బులవాయోలో జరిగిన ఐదవ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో 5-0 తేడాతో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే జట్టుపై విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో భారత జట్టు నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది.