ఫించ్ విజృంభణ, ఆస్ట్రేలియా గెలుపు | Australia beat Bangladesh by seven wickets in World Twenty20 | Sakshi
Sakshi News home page

ఫించ్ విజృంభణ, ఆస్ట్రేలియా గెలుపు

Published Tue, Apr 1 2014 6:08 PM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

ఫించ్ విజృంభణ, ఆస్ట్రేలియా గెలుపు

ఫించ్ విజృంభణ, ఆస్ట్రేలియా గెలుపు

మిర్పూర్: టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాకు ఊరట విజయం లభించింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి సెమీస్ చేరలేకపోయిన ఆసీస్ తన చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 17.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది.

ఆసీస్ ఓపెనర్ ఫించ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. వార్నర్ 48, వైట్ 18, బెయిలీ 11 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. షకీబ్ అల్ హుస్సేన్(66), ముష్ఫికర్ రహీం(47) రాణించారు. ఫించ్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement