బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరాడు. తమీమ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
నిన్న (జులై 5) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన తమీమ్.. తన సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. తమీమ్ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 34 ఏళ్ల తమీమ్ తన 16 ఏళ్ల కెరీర్‌ను అర్ధంతరంగా ముగించడంతో బంగ్లాదేశ్ అభిమానులు అవాక్కవుతున్నారు.
బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడిన తమీమ్.. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.
Comments
Please login to add a commentAdd a comment