వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ఆటగాడికి దక్కని చోటు | Bangladesh Announced World Cup Squad, No Tamim Iqbal, Mahmudullah Included | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ఆటగాడికి దక్కని చోటు

Published Tue, Sep 26 2023 8:29 PM | Last Updated on Wed, Sep 27 2023 4:24 PM

Bangladesh Announced World Cup Squad, No Tamim Iqbal, Mahmudullah Included - Sakshi

అక్టోబర్‌ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కోసం బంగ్లాదేశ్‌ సెలెక్టర్లు తమ జట్టును ఇవాళ ప్రకటించారు. షకీబ్‌ అల్‌ హసన్‌ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో స్టార్‌ ఆటగాడు, బంగ్లాదేశ్‌ లెజెండరీ బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌కు చోటు దక్కలేదు. ఫిట్‌నెస్‌ లేమి కారణంగా తమీమ్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకోలేదని తెలుస్తుంది. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా గాయం కారణంగా అసౌకర్యంగా ఫీలైన తమీమ్‌ అప్పుడే సెలెక్టర్లతో వరల్డ్‌కప్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపాడు.

తమీమ్‌ వర్షన్‌ను పరిగణలోకి తీసుకున్న ఆ దేశ సెలెక్షన్‌ కమిటీ మొత్తానికే అతన్ని వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తొలగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాగా, తమీమ్ ఇటీవల వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఆతర్వాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పిలుపు మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే తమీమ్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో చోటివ్వకుండా సెలక్టర్లు అవమానించారు. తమీమ్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకోకపోవడానికి బంగ్లా ప్రస్తుత కెప్టెన్‌ షకీబ్‌తో ఉన్న విభేదాలే కారణమని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు తమమత జట్లను ప్రకటించిన అనంతరం బంగ్లాదేశ్‌ ఆఖర్లో తమ జట్టును ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో బంగ్లా టీమ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొంటుంది. దీనికి ముందు ఆ జట్టు సెప్టెంబర్‌ 29న శ్రీలంకతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. అనంతరం అక్టోబర్‌ 2న ఇంగ్లండ్‌తో మరో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. మెగా టోర్నీలో భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 19న పూణేలో జరుగనుంది.

బంగ్లాదేశ్‌: షకీబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీం, లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ హొసేన్‌ షాంటో, మెహిది హసన్‌ మీరజ్‌, తౌహిద్‌ హ్రిదోయ్‌,తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షొరీఫుల్‌ ఇస్లాం, హసన్‌ మహమూద్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిది హసన్‌, తంజిమ్‌ షకీబ్‌, తంజిద్‌ తమీమ్‌, మహ్మదుల్లా రియాద్‌

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌

సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్క్రమ్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, మార్కో జన్సెన్‌, అండిల్‌ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, కేశవ్‌ మహారాజ్‌, లుంగి ఎంగిడి, లిజాడ్‌ విలియమ్స్‌, కగిసో రబాడ, తబ్రేజ్‌ షంషి

ఆస్ట్రేలియా: పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, కెమరూన్‌ గ్రీన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, సీన్‌ అబాట్‌, అస్టన్‌ అగర్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌

నెదర్లాండ్స్‌: స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్‌), విక్రమ్‌జీత్‌ సింగ్‌, సకీబ్‌ జుల్ఫికర్‌, సైబ్రాండ్‌ ఎంజెల్‌బ్రెచ్‌, కొలిన్‌ అకెర్‌మ్యాన్‌, బాస్‌ డీ లీడ్‌, తేజ నిడమనూరు, షరీజ్‌ అహ్మద్‌, మ్యాక్స్‌ ఔడౌడ్‌, రోల్ఫ్‌ వాన్‌ డర్‌ మెర్వ్‌, వెస్లీ బర్రెసీ, లొగన​్‌ వాన్‌ బీక్‌, ర్యాన్‌ క్లెయిన్‌, ఆర్యన్‌ దత్‌, పాల్‌ వాన్‌ మీకెరెన్‌

న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, డారిల్‌ మిచెల్‌, జేమ్స​్‌ నీషమ్‌, రచిన్‌ రవీంద్ర, విల్‌ యంగ్‌, మిచెల్‌ సాంట్నర్‌, డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లోకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, ఐష్‌ సోధి, టిమ్‌ సౌథీ

ఆఫ్ఘనిస్తాన్‌: హస్మతుల్లా షాహిది (కెప్టెన్‌), ఇబ్రహీమ్‌ జద్రాన్‌, రియాజ్‌ హసన్‌, నజీబుల్లా జద్రాన్‌, రెహ్మాత్‌ షా, మొహమ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇక్రమ్‌ అలికిల్‌, అబ్దుల్‌ రహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఫజల్‌ హాక్‌ ఫారూకీ, నవీన్‌ ఉల్‌ హాక్‌

ఇంగ్లండ్‌: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), హ్యారీ బ్రూక్‌, డేవిడ్‌ మలాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జో రూట్‌, మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కర్రన్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, జానీ బెయిర్‌స్టో, గస్‌ అట్కిన్సన్‌, ఆదిల్‌ రషీద్‌, రీస్‌ టాప్లే, మార్క్‌ వుడ్‌
 
పాకిస్తాన్‌: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, ఫకర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, అఘా సల్మాన్‌, సౌద్‌ షకీల్‌, షాదాబ్‌ ఖాన్‌, మొహమ్మద్‌ నవాజ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌, హరీస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ, మొహమ్మద్‌ వసీం జూనియర్‌, షాహీన్‌ అఫ్రిది, ఉసామా మిర్‌

శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్‌), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్‌ హేమంత, దిల్షన్‌ మధుశంక


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement