బంగ్లా, పాక్ తొలి టెస్టు డ్రా
కుల్నా: రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిన బంగ్లాదేశ్... పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (206; 17 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత డబుల్ సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 136 ఓవర్లలో 6 వికెట్లకు 555 పరుగులు చేసింది. 273/0 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఐదో రోజు ఆట కొనసాగించిన బంగ్లా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడారు. తమీమ్, కైస్ (150; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) రికార్డు స్థాయిలో తొలి వికెట్‌కు 312 పరుగులు జోడించారు. బంగ్లా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. తమీమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పాక్‌తో ఆడిన గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లా తొలిసారి ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం విశేషం. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 6 నుంచి జరుగుతుంది.
తమీమ్ డబుల్ సెంచరీ
Published Sun, May 3 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM
Advertisement
Advertisement