రాణించిన తమీమ్ | Tamim fails to learn his lessons | Sakshi
Sakshi News home page

రాణించిన తమీమ్

Published Tue, Oct 22 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

రాణించిన తమీమ్

రాణించిన తమీమ్

ఢాకా: న్యూజిలాండ్‌తో సోమవారం ప్రారంభమైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. తమీమ్ ఇక్బాల్ (95) అర్ధసెంచరీ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 54.4 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ముష్ఫీకర్ రహీమ్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో అనాముల్ హక్ (7) తొందరగా విఫలమైనా.. తమీమ్ కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. మార్షల్ అయూబ్ (41)తో కలిసి రెండో వికెట్‌కు 67; మొమినల్ హక్ (47)తో మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. 208/3 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న బంగ్లాను చివర్లో కివీస్ బౌలర్లు కట్టడి చేశారు. తమీమ్, షకీబ్ అల్ హసన్ (20)లను వెంటవెంటనే అవుట్ చేయడంతో 228 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement