
తమీమ్ సెంచరీ
బంగ్లాదేశ్ 220 ఆలౌట్
ఇంగ్లండ్ 50/3
ఢాకా: ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల మధ్య మొదలైన రెండో టెస్టులో తొలిరోజు ఏకంగా 13 వికెట్లు నేలకూలారుు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 63.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటరుుంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (147 బంతుల్లో 104; 12 ఫోర్లు) అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. మోమినుల్ హక్ (66) రాణించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 170 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితిలో కనిపించింది.
అరుుతే స్పిన్నర్ మొరుున్ అలీ (5/57) ధాటికి మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా క్యూ కట్టడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావలసి వచ్చింది. కేవలం 49 పరుగుల వ్యవధిలో బంగ్లాదేశ్ ఏకంగా 9 వికెట్లు కోల్పోరుుంది. వోక్స్ మూడు, స్టోక్స్ రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఇంగ్లండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌సలో 12.3 ఓవర్లలో మూడు వికెట్లకు 50 పరుగులు చేసింది. రూట్ 15, అలీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా సాగలేదు.