మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ | West Indies vs Bangladesh 3rd ODI: Bangladesh Win By Four wickets | Sakshi
Sakshi News home page

West Indies vs Bangladesh 3rd ODI: బంగ్లాదేశ్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

Published Sun, Jul 17 2022 11:23 AM | Last Updated on Sun, Jul 17 2022 11:25 AM

West Indies vs Bangladesh 3rd ODI: Bangladesh Win By Four wickets - Sakshi

గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన అఖరి వన్డేలో బంగ్లాదేశ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో బంగ్లాదేశ్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. బంగ్లా బౌలర్‌ తైజుల్ ఇస్లామ్ దాటికి 178 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్లలో తైజుల్ 5 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్,ముస్తఫిజుర్ రెహ్మన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

ఇక విండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ పూరన్‌ 75 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 179 పరుగులతో లక్క్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్‌ దాస్‌(50), తమీమ్‌(34) పరుగులతో రాణించారు. అదే విధంగా విండీస్‌ బౌలర్లలో గుడాకేష్ మోతీ నాలుగు వికెట్లు  పడగొట్టాడు. ఇక అంతకుముందు టెస్టు,టీ 20 సిరీస్‌లను విండీస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: Tamim Iqbal: టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement