ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం..
చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. అఖరి ఓవర్‌లో 13 పరుగుల కావల్సిన నేపథ్యంలో బౌలింగ్ చేసిన రస్సెల్ 9 పరుగలే ఇచ్చి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలింగ్‌లో రస్సెల్, బ్రావో, హోసేన్, రవి రాంపాల్, హోల్డర్ చెరో వికెట్ సాధించారు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో మహ్మదుల్లా(31), లిటన్ దాస్(44) పరుగులు చేశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. వెస్టిండీస్ 30 పరగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోస్టన్ చేజ్, పూరన్ వెస్టిండీస్ జట్టును అదుకున్నారు. ఆఖర్లో పూరన్, జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపించడంతో విండీస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. విండీస్ బ్యాటింగ్‌లో చేజ్(39),పూరన్(40)పరుగులు సాధించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం,ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. రహీమ్(8) ఔట్
లక్ష్య ఛేదనలో వరుస క్రమంలో బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది. అకేల్ హోసేన్ బౌలింగ్‌లో 17 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ పెవిలియన్‌కు చేరగా, రవి రాంపాల్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్() క్లీన్ బౌల్డ్‌య్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహ్మదుల్లా(7), లిటన్ దాస్(34) పరుగులతో ఉన్నారు. ఇంకా బంగ్లాదేశ్ విజయానికి 30 బంతుల్లో 44 పరుగులు కావాలి.
రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. నయీమ్(17) ఔట్
17 పరుగులు చేసిన మహ్మద్ నయీమ్‌ను జాసన్ హోల్డర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 10 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సౌమ్య సర్కార్(13), లిటన్ దాస్(15) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. షకీబ్(9) ఔట్
143 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షకీబ్, రస్సెల్ బౌలింగ్‌లో హాల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ నయీమ్(16), లిటన్ దాస్(2) పరుగులతో ఉన్నారు.
బంగ్లాదేశ్ టార్గెట్ 143 పరుగులు..
బంగ్లాదేశతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ 30 పరగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోస్టన్ చేజ్, పూరన్ వెస్టిండీస్ జట్టును అదుకున్నారు. ఆఖర్లో పూరన్, జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపించడంతో విండీస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. విండీస్ బ్యాటింగ్‌లో చేజ్(39),పూరన్(40)పరుగులు సాధించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం,ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. పూరన్(40) ఔట్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పూరన్ రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాసేపు సిక్సర్‌లు, ఫోర్లతో పూరన్ అలరించాడు. 22 బంతుల్లో 40 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం వీండిస్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్..హెట్‌మైర్(9) ఔట్
సమయం:16:30 బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. మెహిది హసన్ బౌలింగ్‌లో హెట్‌మైర్ సౌమ్యా సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలయన్‌కు చేరాడు. ప్రస్తుతం వీండిస్ 11 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్(24), పొలార్డ్(4) పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. గేల్(4) ఔట్
సమయం:16:03..టీ20 ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ మరో సారి నిరాశపర్చాడు. కేవలం 4 పరుగలుకే మెహిది హసన్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం వీండిస్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్(5), షిమ్రోన్ హెట్‌మైర్ (8)పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. లూయిస్(6) ఔట్
సమయం:15:43..బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లూయిస్(6) రూపంలో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం వీండిస్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి17 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్(5), క్రిస్ గేల్ (4)పరుగులతో ఆడుతున్నారు.
షార్జా: టి20 ప్రపంచకప్2021లో భాగంగా సూపర్ 12 గ్రూప్1లో నేడు వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఇరుజట్లు వరుస ఓటమిలతో ఇప్పటికే సెమీఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకున్నాయి. ఇక ముఖాముఖి ఇరుజట్లు టి20ల్లో 11 సార్లు తలపడగా..6 సార్లు వెస్టిండీస్.. 5 సార్లు బంగ్లాదేశ్ విజయం సాధించింది.
బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), సౌమ్యా సర్కార్, మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం,టాస్కిన్ అహ్మద్ ముస్తాఫిజుర్ రెహ్మాన్
వెస్టిండీస్: రోస్టన్ చేజ్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, షిమ్రోన్ హెట్‌మైర్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ (కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, జాసన్ హోల్డర్, రవి రాంపాల్
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment