T20 World Cup 2021: ఆసీస్‌ చేతిలో విండీస్‌ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..! | T20 World Cup 2021 AUS Vs WIN: West Indies Aim For Direct Qualification For 2022 T20 WC | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: ఆసీస్‌ చేతిలో విండీస్‌ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..!

Published Sat, Nov 6 2021 6:14 PM | Last Updated on Sat, Nov 6 2021 7:28 PM

T20 World Cup 2021 AUS Vs WIN: West Indies Aim For Direct Qualification For 2022 T20 WC - Sakshi

Update: ఊహించిన విధంగానే విండీస్‌ ఆసీస్‌ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఏడాది నవంబర్‌ 15 లోపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ 8లో ఉన్న జట్లు మాత్రమే నేరుగా టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12 దశకు నేరుగా అర్హత సాధించనున్నాయి. ప్రస్తుతం విండీస్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది. ఇవాళ ఆసీస్‌ చేతిలో ఓటమితో విండీస్‌ ర్యాంక్‌ మరింత దిగజారనుంది.
స్కోర్లు:
వెస్టిండీస్‌: 157/7(20 ఓవర్లు)

ఆస్ట్రేలియా: 162/2(16.2 ఓవర్లు)

West Indies Will Directly Qualify For 2022 T20 WC If They Win Against Australia: టీ20 ప్రపంచకప్‌-2021 సూపర్‌ 12లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఓడిపోయి సెమీస్‌ రేసు నుంచి తప్పుకున్న వెస్టిండీస్‌కు మరో కష్టమొచ్చి పడింది. ఇవాళ(నవంబర్‌ 6) ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరీబియన్‌ వీరులు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2022 టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12కు నేరుగా అర్హత సాధించాలంటే విండీస్‌.. ఆసీస్‌పై కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే ఈ ఏడాది శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లలా ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్‌, నవంబర్‌లలో జరిగే మెగా టోర్నీలో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది టాప్‌-8లో ఉండే జట్లు వచ్చే ఏడాది సూపర్‌-12కు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న విండీస్‌.. ఆసీస్‌ చేతిలో ఓడితే మరింత కిందకు పడిపోతుంది.  
చదవండి: ఎన్‌సీఏ డైరెక్ట‌ర్‌గా వీవీఎస్‌ ల‌క్ష్మ‌ణ్..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement