
హామిల్టన్: న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (128 బంతుల్లో 126; 21 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు వేగంతో కెరీర్‌లో తొమ్మిదో శతకం సాధించగా...మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. నీల్ వాగ్నర్ (5/47) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. సౌతీకి 3 వికెట్లు దక్కాయి. ఒక దశలో 121/1 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచిన బంగ్లా ఆ తర్వాత కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్ గురువారం ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. జీత్ రావల్ (51 బ్యాటింగ్), టామ్ లాథమ్ (35 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ మరో 148 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment