కుప్పకూలిన బంగ్లాదేశ్
l రాణించిన తమీమ్ ఇక్బాల్
l స్టార్క్‌కు నాలుగు వికెట్లు
పేసర్ మిషెల్ స్టార్క్ (4/29) డెత్ ఓవర్లలో చేసిన మాయాజాలానికి బంగ్లాదేశ్ కుదేలైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో చాంపియ¯Œ్స ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలింది. షకీబ్ (48 బంతుల్లో 29; 2 ఫోర్లు), మిరాజ్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. జంపాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన అనంతరం వర్షం ఆటంకంతో మ్యాచ్ ఆగింది. క్రీజులో వార్నర్ (44 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), స్మిత్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) ఉన్నారు.
తమీమ్ మినహా...
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఒక్కడే ఎదురొడ్డి నిలవగలిగాడు. ప్రత్యర్థి బౌలింగ్ జోరుకు తొలి 22 ఓవర్లలో బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. అటు 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దీనస్థితిలో తమీమ్, షకీబ్ జోడి జట్టుకు ఊపిరిలూదింది. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంతవరకే జట్టు ఆటలో కాస్త మెరుపులు కనిపించాయి. నిలకడగా ఆడుతున్న ఈ భాగస్వామ్యాన్ని 30వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ విడదీశాడు. ఆ ఓవర్ తొలి రెండు బంతులను తమీమ్ సిక్సర్లుగా మలిచినా ఐదో బంతికి షకీబ్ ఎల్బీగా అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బ్యాట్స్‌మె¯ŒS ఇలా వచ్చి అలా వెళ్లగా 43వ ఓవర్‌లో స్టార్క్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. సెంచరీకి అతి చేరువలో ఉన్న తమీమ్‌తో పాటు.. మోర్తజా (2), రూబెల్‌లను నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియకు పంపడంతో పాటు తన మరుసటి ఓవర్‌లో చివరి వికెట్‌ను కూడా తీయగా బంగ్లా స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది.
183 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు వార్నర్, ఫించ్ (27 బంతుల్లో 19; 3 ఫోర్లు) ధాటిగా ఆరంభించి తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఫించ్ అవుటయ్యాక ... వార్నర్, స్మిత్ నిలకడగా లక్ష్యం వైపు సాగుతున్న వేళ 16వ ఓవర్ అనంతరం వర్షం అంతరాయం కలిగించింది.