సంచలన రికార్డుపై రోహిత్‌ శర్మ కన్ను.. | Rohit Sharma On Verge Of Sensational T20I Feat, 1st Time In History | Sakshi
Sakshi News home page

Ind vs Afg: సంచలన రికార్డుపై రోహిత్‌ శర్మ కన్ను..

Published Sat, Jan 13 2024 12:14 PM | Last Updated on Sat, Jan 13 2024 1:11 PM

Rohit Sharma On Verge Of Sensational T20I Feat 1st Time In History - Sakshi

India vs Afghanistan, 2nd T20I - Rohit Sharma Eyes On Rare Record: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అత్యంత అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టీ20లలో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేయడానికి అడుగుదూరంలో ఉన్నాడు. దాదాపు పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్‌ ఇంటర్నేషనల్‌ పొట్టి ఫార్మాట్లో పునరాగమనం చేశాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీస్‌లో భారత జట్టు ఓటమి తర్వాత.. మళ్లీ తాజాగా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో మరోసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. 

రీఎంట్రీలో డకౌట్‌ అయినా వరల్డ్‌ రికార్డు
మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సమన్వయలోపం కారణంగా డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేయడంతో సారథిగా రోహిత్‌ ఖాతాలో మరో విజయం నమోదైంది. తద్వారా.. అంతర్జాతీయ టీ20లలో 100 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక పురుష క్రికెటర్‌గానూ హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు.

అదే జరిగితే ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్‌గా
ఇదిలా ఉంటే.. ఇప్పటికే అఫ్గన్‌తో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇండోర్‌ వేదికగా ఆదివారం (జనవరి 14) రెండో మ్యాచ్‌లో తలపడనుంది. రోహిత్‌ శర్మ కెరీర్‌లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. ఏ ఆటంకాలు లేకుండా హిట్‌మ్యాన్‌ ఈ మ్యాచ్ పూర్తి చేస్తే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. అదండీ విషయం..!!

అంతర్జాతీయ టీ20లలో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్‌-5 క్రికెటర్లు
‌1. రోహిత్‌ శర్మ(ఇండియా)- 149
2. పాల్‌ స్టిర్లింగ్‌(ఐర్లాండ్‌)- 134
3.జార్జ్‌ డాక్రెల్‌(ఐర్లాండ్‌)- 128
4. షోయబ్‌ మాలిక్‌(పాకిస్తాన్‌)- 124
5. మార్టిన్‌ గప్టిల్‌(న్యూజిలాండ్‌)- 122.

చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్‌ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement