చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 7వికెట్ల తేడాతో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న బంగ్లా ఆశలకు ఐరీష్ జట్టు కళ్లెం వేసింది. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. మూడు వికెట్లు కోల్పోయి కేవలం 14 ఓవర్లలోనే చేధించింది.
ఐర్లాండ్ బ్యాటర్లలో పాల్ స్టిర్లింగ్ విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న స్టిర్లింగ్ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో షమీమ్ హొస్సేన్(51) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. మాథ్యూ హంఫ్రీస్ రెండు, హాండ్, హ్యారీ టెక్టర్, వైట్, డెలానీ తలా వికెట్ సాధించారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
కాగా టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఐర్లాండ్‌కు బంగ్లాదేశ్‌పై 14 ఏళ్ల తర్వాత ఇదే తొలి టీ20 మ్యాచ్ విజయం. బంగ్లాదేశ్‌పై చివరగా 2009 టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ విజయం సాధించింది.
చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం
Comments
Please login to add a commentAdd a comment