
రెండో టీ20లో బంగ్లాదేశ్ విజయం
Bangladesh vs Ireland, 2nd T20I: ఐర్లాండ్‌తో రెండో టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. చట్టోగ్రామ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్- ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్(83), రోనీ తాలుక్దార్(44) అద్భుతంగా రాణించారు. వీరికి తోడు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 17 ఓవర్లలో ఆతిథ్య బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు స్కోరు చేసింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు బంగ్లా కెప్టెన్ షకీబ్ చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. షకీబ్ దెబ్బకు ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. పేసర్ టస్కిన్ అహ్మద్ సైతం అద్భుతంగా రాణించాడు. ఐరిష్ స్టార్ ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ వికెట్‌తో శుభారంభం అందించిన అతడు మొత్తంగా 3 వికెట్లతో సత్తా చాటాడు.
బంగ్లా బౌలర్ల విజృంభణతో నిర్ణీత 17 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ఐర్లాండ్ కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్ అల్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా బంగ్లా గెలుచుకున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20 స్కోర్లు
బంగ్లాదేశ్- 202/3 (17)
ఐర్లాండ్- 125/9 (17)
చదవండి: David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి..
ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్ జట్టులో సూర్యకు చోటు ఖాయం! ఒక్క సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన..