Ireland Announced 15 Man Squad For T20I Series Against India, Check Names And Other Details Inside - Sakshi
Sakshi News home page

IND Vs IRE T20I Series: ఇండియాతో టీ20 సిరీస్‌.. ఐర్లాండ్‌ జట్టు ప్రకటన

Published Fri, Aug 4 2023 7:04 PM | Last Updated on Fri, Aug 4 2023 8:17 PM

Ireland Announces T20I Squad For India Series - Sakshi

ఇండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం​ ఐర్లాండ్‌ 15 మంది సభ్యుల జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 4) ప్రకటించింది. ఈ జట్టుకు పాల్‌ స్టిర్లింగ్‌ నాయకత్వం వహించనున్నాడు. ఐర్లాండ్‌ 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో పటిష్టమైన పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేసింది.

విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం ఆగస్ట్‌ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20 జరుగనున్నాయి. మరోవైపు ఈ పర్యటన కోసం భారత జట్టును కూడా ఇటీవలే ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతనికి డిప్యూటీగా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనుండగా.. ఐపీఎల్‌-2023 స్టార్లు రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్‌ వైట్‌, క్రెయిగ్ యంగ్

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement