
టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ 20 ఫార్మాట్‌లో 300 ఫోర్లు బాదిన రెండో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండో టీ20లో రోహిత్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం.
ఇక ఓవరాల్‌గా ఐర్లాండ్ స్టార్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 325 ఫోర్లతో టాప్‌లో ఉండగా రోహిత్ 301 ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు.. అదే విధంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. ఇక సిక్సర్లలో గప్తిల్ (165) తొలి స్థానంలో ఉండగా.. రోహిత్(157) సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: Ravindra Jadeja: 'జడేజాతో ఎలాంటి విభేదాలు లేవు.. అది అతడి వ్యక్తిగతం'
Comments
Please login to add a commentAdd a comment