CSK Official Denies Rumours On Rift With Ravindra Jadeja, Details Inside - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: 'జడేజాతో ఎలాంటి విభేదాలు లేవు.. అది అతడి వ్యక్తిగతం'

Published Sat, Jul 9 2022 7:32 PM | Last Updated on Sat, Jul 9 2022 8:09 PM

CSK deny claims of rift with Ravindra Jadeja - Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నుంచి తప్పుకోనున్నాడని వస్తున్న వార్తలను ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ తోసి పుచ్చింది. కాగా వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కేకు జడేజా గుడ్‌బై చెప్పునున్నాడానే వార్తలు ఎప్పటి నుంచే వినిపిస్తున్నాయి, అయితే తాజాగా జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సీఎస్‌కేకు సంబంధించిన అన్ని రకాల పోస్టులను డిలీట్‌ చేశాడు. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఈ విషయంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారి ఒకరు స్పందించారు. "జడేజా పోస్టులను తొలిగించడం అతని వ్యక్తిగతం. అతడితో మా జట్టుకు ఎటువం‍టి విభేదాలు లేవు" అని సీఎస్‌కే అధికారి పేర్కొన్నారు.

 కాగా ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో జడేజా కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా జడేజా దారుణంగా విఫలమయ్యాడు. కాగా కెప్టెన్సీ ఫ్రెషర్‌ కారణంగా జడేజా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. అనంతరం తిరిగి ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు.
చదవండి: APL 2022: ఏపీఎల్‌లో రాణిస్తున్న వైజాగ్‌ ఆటగాళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement