ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా చెన్నై బ్రేవ్ జాగ్వర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా ఫాఫ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. చెన్నై బ్రేవ్ ఇన్నింగ్స్‌లో వాన్ డర్ డస్సెన్ 3, జోష్ బ్రౌన్ 13, భానుక రాజపక్ష 18, తిసార పెరీరా 8, క్రిస్ లిన్ 3, కోబ్ హెర్ఫ్ట్ 1 పరుగు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో ఇమాద్ వసీం, ఆమిర్ హమ్జా, ఉడాన, కరీమ్ జనత్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ.. ఫాఫ్ చెలరేగిపోవడంతో మరో 18 బంతులు మిగిలుండగానే (వికెట్ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో షర్జీల్ ఖాన్ 8, చరిత్ అసలంక 17 పరుగులు చేశారు. చెన్నై బ్రేవ్ బౌలర్లలో ఒషేన్ థామస్‌కు ఓ వికెట్ దక్కింది.
కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫాఫ్ డుప్లెసిస్ ఇవాళ (నవంబర్ 25) ఆక్షన్‌కు రానున్నాడు. ఫాఫ్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫాఫ్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఫాఫ్ కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment