నాటింగ్‌హామ్: లివింగ్‌స్టోన్ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 9 సిక్స్ లు) పోరాటం వృథా అయింది. ఇంగ్లండ్ తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్న లివింగ్‌స్టోన్ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. దాంతో పాకిస్తాన్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో ఓడింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. టి20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 85; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిజ్వాన్ (41 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లండ్‌ను పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది (3/30) దెబ్బతీశాడు. రెండో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment