విద్యాశాఖ కార్యాలయాల్లోనూ బయెమెట్రిక్
Published Wed, May 24 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
– వచ్చే నెల 1 నుంచి ఈ–హాజరు తప్పని సరి
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ప్రవేశ పెట్టిన బయెమెట్రిక్ ద్వారా ఈ–హాజరు నమోదు చేస్తున్నట్లుగానే, విద్యాశాఖ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ తరపున నరసింహారావు ఆర్.సీ నెంబర్ 58 బుధవారం జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంతో పాటు, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ప్రభుత్వ డైట్, బీఈడీ కాలేజీల్లోను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30వ తేదిలోపు బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసుకుని, వచ్చే నెల 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
Advertisement