భయోమెట్రిక్
► అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలుకు సన్నద్ధం
► అంగన్‌వాడీలకు రోజుకు మూడుసార్లు హాజరు
► ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన చిన్నారులకే పోషకాహారం
► ఆందోళనలో అంగన్‌వాడీలు
ఒంగోలు టౌన్ : అంగన్‌వాడీలను బయోమెట్రిక్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు కొన్ని శాఖలకే పరిమితమైన బయోమెట్రిక్ విధానాన్ని తాజాగా అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచడంతో కార్యకర్తలు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో బయోమెట్రిక్ రాకతో తమను మరింత మానసిక క్షోభకు గురిచేస్తారేమోనని అనేక మంది అంగన్‌వాడీలు వాపోతున్నారు. బయోమెట్రిక్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు మినహారుుంపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రాజెక్టుల స్థారుులో సీడీపీఓలు, జిల్లా స్థారుులో ప్రాజెక్టు డెరైక్టర్‌ను కలిసి బయోమెట్రిక్ విధానం వల్ల కలిగే ఇబ్బందులను వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు.
జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నారుు. వాటి పరిధిలో 4,244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నారుు. వీటి పరిధిలో ప్రస్తుతం 31 వేల మంది గర్భిణులు, 30 వేల మంది బాలింతలు, ఆరునెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు లక్షా 27 వేల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 97 వేల మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా 25 రోజులకు సరిపడే విధంగా 3 కేజీల బియ్యం, అరకేజీ కందిపప్పు, 400 గ్రాముల వంటనూనె, వారానికి నాలుగు కోడిగుడ్లు చొప్పున అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు వారానికి నాలుగు కోడిగుడ్లు అక్కడే వండి పోషకాహారం కింద అందిస్తుంటారు.
ఆందోళన కలిగిస్తున్న హాజరు విధానం...
అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్న బయోమెట్రిక్‌లో హాజరు విధానం అంగన్‌వాడీలను ఆందోళనకు గురిచేస్తోంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రతిరోజూ మూడుసార్లు హాజరు విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం నాలుగు గంటలకు కచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు కూడా బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు చిన్నారుల హాజరు తీసుకోనున్నారు. ఆ సమయానికి ఎంతమంది చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉంటే వారికి మాత్రమే పోషకాహారం అందించాలని ఆదేశాలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలు మాత్రం ఠంచనుగా తమకు సూచించిన సమయానికి హాజరు వేసినప్పటికీ చిన్నారులను కేంద్రాలకు తీసుకురావడం మాత్రం కష్టతరమని అంగన్‌వాడీలు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా చిన్నారులను సరిగ్గా తొమ్మిది గంటలకు కేంద్రాలకు తీసుకురావడం కష్టమని వాపోతున్నారు. చిన్నారులకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
గర్భిణులు, బాలింతలకు తప్పని తిప్పలు...
ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. అందులో భాగంగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు సంబంధించి ఒకేచోట విద్యనందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతంలో విడివిడిగా ఉంటున్న మూడు అంగన్‌వాడీ కేంద్రాలను ఒకేచోటకు తీసుకువచ్చి అక్కడ నిర్వహించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు అందారుు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలను ఒకచోటికి తీసుకువచ్చే కసరత్తు జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్న వాటిని మరోచోటకు మార్చడం వల్ల ఆ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు కూడా కష్టంగా మారనుంది. వారిని దూర ప్రాంతాల్లో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి బయోమెట్రిక్ ద్వారా నిత్యవసర సరుకులు అందించాల్సి ఉంటుంది. అరుుతే గర్భిణులు, బాలింతలు అంతదూరం రాలేకపోతే వారికి నిత్యవసర సరుకులు దూరం కానున్నారుు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.