
బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్
► 23 వసతిగృహాల్లో అమలు
► వార్డెన్లు, సిబ్బంది గైర్హాజరును తగ్గించే యత్నం
► నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లకు ముకుతాడు
► విద్యార్థుల హాజరుశాతంపై స్పష్టత వస్తుందని అంచనా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల పనితీరు ఇకపై మెరుగుపడనుంది. అడ్డగోలు వ్యవహారాలకు కేరాఫ్‌గా నిలిచే హాస్టళ్లను గాడిలో పెట్టే దిశగా జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యోగులు, ఇతర సిబ్బంది సమయపాలన ఖచ్చితత్వం కోసం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన బీసీ సంక్షేమ శాఖ.. ఈ మేరకు యూనిట్ల కొనుగోలు, అమరిక బాధ్యతను రాష్ట్ర టెక్నాలజీ శాఖకు అప్పగించింది. జిల్లాలోని 23 బీసీ హాస్టళల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారయంత్రాంగం నిర్ణయించింది.
తద్వారా హాస్టళ్లలో విధులు నిర్వర్తించే వార్డెన్లు, ఇతర సిబ్బందిలో అనధికార గైర్హాజరును తగ్గించవచ్చని అంచనా వేసింది. చాలా హాస్టళ్ల వార్డెన్లువిద్యార్థుల్లేక మూతపడిన ఇంజినీరింగ్ కాలేజీలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కొన్ని ఫంక్షన్ హాళ్లుగా రూపాంతరం చెందగా.. మరికొన్ని కొత్త కలెక్టరేట్లుగా అవతరించాయి. తాజాగా మరికొన్ని బీసీ గురుకుల పాఠశాలలుగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. విశాల ప్రాంగణం.. చక్కని మైదానం, పచ్చని చెట్ల మధ్య కొలువుదీరిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల నిర్వహణ నుంచి తప్పుకోవడంతో మూతపడ్డాయి. దీంతో వీటిని నిర్వహించడం యాజమాన్యాలకు ఆర్థికంగా భారంగా పరిణవిుంచింది. అలాగే వదిలేస్తే భవనాలు కూడా స్థానికంగా నివాసం ఉండకుండా.. సమీప ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్రమాలకు చెక్!
హెడ్‌క్వార్టర్‌లో వార్డెన్లు/ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడంతో హాస్టళ్లు దారుణంగా తయారవుతున్నాయని ఫిర్యాదులందాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే డుమ్మాలు కొడుతున్నట్లు దృష్టికి వచ్చింది. ఎవరైనా తనిఖీలు వస్తే తప్పించుకోవడానికి సెలవుపత్రం ఒకటి అక్కడ ఉంచుతున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లకు ముకుతాడు వేయడానికి బయోమెట్రిక్ దోహదపడుతుందని యంత్రాంగం భావిస్తోంది. మరోవైపు విద్యార్థుల హాజరుశాతంపై కూడా స్పష్టత వస్తుందని అంచనా వేస్తోంది.
నిర్దేశిత సంఖ్యలో హాస్టళ్లలో విద్యార్థులు లేనప్పటికీ, అదనపు సంఖ్యను సృష్టించి డైట్, కాస్మొటిక్ నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పండగ వేళ విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లినప్పటికీ, హాజరుపట్టికలో మాత్రం ఎలాంటి తేడా ఉండడం లేదు. ఆ రోజు కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరైనట్లు రికార్డులు నమోదు చేసి.. బియ్యం కాజేస్తున్నట్లు తేలింది. హాస్టల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అన్నం వడ్డిస్తోంది. భారీ వ్యయాన్ని భరించి సన్నబియ్యం సరఫరా చేస్తుండగా.. కొందరు వార్డెన్లు ఈ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఇటీవల కొన్ని సంఘటనల్లో వెలుగు చూసింది.
వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం రాష్ట్రంలోనే తొలిసారిగా బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానం సత్ఫలితాలిచి్చంది. ఏకంగా 25శాతం మేర కలిసొచ్చినట్లు లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో ఇతర హాస్టళ్లకు కూడా విస్తరింపజేయాలని కలెక్టర్ రఘునందన్ రావు నిర్ణయించారు.