Welfare facilities
-
బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్
► 23 వసతిగృహాల్లో అమలు ► వార్డెన్లు, సిబ్బంది గైర్హాజరును తగ్గించే యత్నం ► నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లకు ముకుతాడు ► విద్యార్థుల హాజరుశాతంపై స్పష్టత వస్తుందని అంచనా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల పనితీరు ఇకపై మెరుగుపడనుంది. అడ్డగోలు వ్యవహారాలకు కేరాఫ్‌గా నిలిచే హాస్టళ్లను గాడిలో పెట్టే దిశగా జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యోగులు, ఇతర సిబ్బంది సమయపాలన ఖచ్చితత్వం కోసం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన బీసీ సంక్షేమ శాఖ.. ఈ మేరకు యూనిట్ల కొనుగోలు, అమరిక బాధ్యతను రాష్ట్ర టెక్నాలజీ శాఖకు అప్పగించింది. జిల్లాలోని 23 బీసీ హాస్టళల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారయంత్రాంగం నిర్ణయించింది. తద్వారా హాస్టళ్లలో విధులు నిర్వర్తించే వార్డెన్లు, ఇతర సిబ్బందిలో అనధికార గైర్హాజరును తగ్గించవచ్చని అంచనా వేసింది. చాలా హాస్టళ్ల వార్డెన్లువిద్యార్థుల్లేక మూతపడిన ఇంజినీరింగ్ కాలేజీలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కొన్ని ఫంక్షన్ హాళ్లుగా రూపాంతరం చెందగా.. మరికొన్ని కొత్త కలెక్టరేట్లుగా అవతరించాయి. తాజాగా మరికొన్ని బీసీ గురుకుల పాఠశాలలుగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. విశాల ప్రాంగణం.. చక్కని మైదానం, పచ్చని చెట్ల మధ్య కొలువుదీరిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల నిర్వహణ నుంచి తప్పుకోవడంతో మూతపడ్డాయి. దీంతో వీటిని నిర్వహించడం యాజమాన్యాలకు ఆర్థికంగా భారంగా పరిణవిుంచింది. అలాగే వదిలేస్తే భవనాలు కూడా స్థానికంగా నివాసం ఉండకుండా.. సమీప ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు చెక్! హెడ్‌క్వార్టర్‌లో వార్డెన్లు/ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడంతో హాస్టళ్లు దారుణంగా తయారవుతున్నాయని ఫిర్యాదులందాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే డుమ్మాలు కొడుతున్నట్లు దృష్టికి వచ్చింది. ఎవరైనా తనిఖీలు వస్తే తప్పించుకోవడానికి సెలవుపత్రం ఒకటి అక్కడ ఉంచుతున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లకు ముకుతాడు వేయడానికి బయోమెట్రిక్ దోహదపడుతుందని యంత్రాంగం భావిస్తోంది. మరోవైపు విద్యార్థుల హాజరుశాతంపై కూడా స్పష్టత వస్తుందని అంచనా వేస్తోంది. నిర్దేశిత సంఖ్యలో హాస్టళ్లలో విద్యార్థులు లేనప్పటికీ, అదనపు సంఖ్యను సృష్టించి డైట్, కాస్మొటిక్ నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పండగ వేళ విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లినప్పటికీ, హాజరుపట్టికలో మాత్రం ఎలాంటి తేడా ఉండడం లేదు. ఆ రోజు కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరైనట్లు రికార్డులు నమోదు చేసి.. బియ్యం కాజేస్తున్నట్లు తేలింది. హాస్టల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అన్నం వడ్డిస్తోంది. భారీ వ్యయాన్ని భరించి సన్నబియ్యం సరఫరా చేస్తుండగా.. కొందరు వార్డెన్లు ఈ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఇటీవల కొన్ని సంఘటనల్లో వెలుగు చూసింది. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం రాష్ట్రంలోనే తొలిసారిగా బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానం సత్ఫలితాలిచి్చంది. ఏకంగా 25శాతం మేర కలిసొచ్చినట్లు లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో ఇతర హాస్టళ్లకు కూడా విస్తరింపజేయాలని కలెక్టర్ రఘునందన్ రావు నిర్ణయించారు. -
ఇదేం ‘సంక్షేమం’!
వసతి గృహాలు.. సమస్యల నిలయాలు కరువైన మౌలిక వసతులు చలికి వణుకుతున్న విద్యార్థులు పలుచని దుప్పట్లతో తప్పని తిప్పలు విడుదల కాని డైట్.. కాస్మోటిక్ చార్జీలు జగిత్యాల : జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు..సమస్యలకు నిలయాలుగా మారాయి. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు... ఐదు నెలల నుంచి విడుదల కాని డైట్ బిల్లులతో హాస్టల్ వార్డెన్లు అవస్థలు పడుతున్నారు. హాస్టళ్లలో సమస్యల మధ్య బోధనసాగిస్తూ విద్యార్థులు.. వంట సామగ్రి కోసం రూ.లక్షల్లో అప్పులు చేస్తూ వార్డెన్లు కాలం వెళ్లదీస్తున్నారు. ఐదు నెలల నుంచి..కనీసం కాస్మోటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహాల్లో 9, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు చెబుతున్న ట్యూటర్లకు గతేడాది నుంచి వేతనాలు విడుదల కాలేదు. దీంతో ట్యూటర్లు మొక్కుబడిగా చదువులు చెబుతూ.. క్రమంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 40 హాస్టళ్లుండగా.. వాటిలో తొమ్మిది వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగడం గమనార్హం. దీంతో పాటు..హాస్టళ్లలో వైద్యాధికారులు విజిట్ చేయకపోవడంతో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తప్పడంలేదు. చలి, జ్వరాలతో బాధపడుతూ.. విద్యార్థులే బయటి నుంచి మందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ.. చదివే మూ డో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు డైట్ అలవెన్సు కింద ఒక్కొక్కరికి ప్రతి నెల రూ. 750లు ఇస్తుంది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 850, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రూ. 1050ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో పాటు ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రతి నెల రూ.62ల చొప్పున కాస్మోటిక్ ఛార్జీలు ఇస్తుంది. అందులో రూ.51 సబ్బు, ఇతర వస్తువుల కోసం, రూ.11 హెయిర్ కట్టింగ్ కోసం ఇస్తుంది. వి ద్యార్థినిలకు రూ.75లు ఇస్తుంది. ఇందులో సబ్బులు, పౌడర్, నూనె కోసం రూ.50లు, నాప్కిన్, ఇతర వస్తువుల కోసం రూ.25లు ఇస్తుంది. జిల్లాలోని అన్ని హాస్టళ్లకు ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తోంది. కూరగాయలు, నిత్యావసర వస్తువులన్నీ సంబంధింత వార్డెన్లే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. జిల్లాలో ఏహాస్టల్కు డైట్ అలవెన్సులు ఈ ఏడాది జూలై నుంచి విడుదల కాలేదు. ఇప్పటి వరకు ప్రీమెట్రిక్ హాస్టళ్లలో చదివే ఒక్కోవిద్యార్ధికి సగటున రూ.800 చొప్పున లెక్కిస్తే.. నాలుగొందల మందికి కలిసి రూ.1.60 కోట్లు, వెయ్యి మంది పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1050 చొప్పున రూ.52.50 లక్షలు మొత్తం రూ.2.12 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో హాస్టల్ వార్డెన్లు బయట అప్పు చేసి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. కాస్మొటిక్ ఛార్జీల కింద నాలుగొందల మంది విద్యార్ధినీవిద్యార్థులకు సగటున రూ. 67 చొప్పున లెక్కిస్తే.. నాలుగు నెలల కాలంలో రూ. 10.72 లక్షలు బకాయి ఉంది. ఇది ఇలాఉంటే జిల్లాలో తొమ్మిది వసతి గృహాలు ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చలికి వణుకుతూ జిల్లాలోని అనేక హాస్టళ్లలో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. సాయంత్రమైతే చాలు కిటికీలకు లేని తలుపుల ద్వారా వీచే చల్లనిగాలుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఇబ్బందులుపడుతున్నారు. విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్నా.. ఇంకా పంపిణీ కాని దుప్పట్లు.. పలు చోట్ల పంపిణీ చేసిన పలుచని చెద్దర్లకు బదులు ఇంటి నుంచి తమ వెంట తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకుంటున్నారు. ఒకే దుప్పట్లో ఇద్దరేసి విద్యార్థులు జారుకుంటున్నారు. కనీస కార్పెట్లు కూడా కరువవడంతో చాపలు పర్చుకుని నిద్రిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆరుగంటల మొదలు.. ఉదయం 7 గంటల వరకు విద్యార్థులు హాస్టళ్లలో చలితో పోరాటం చేయడం నిత్యాకృత్యమైంది. ఈ కనీసం కిటికీలకు తలుపులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బయటి నుంచి చలి నేరుగా విద్యార్థులు నిదించే గదుల్లోకి ప్రవేశిస్తోంది. ఉదాహరణకు.. మల్లాపూర్ మండల కేంద్రంలో.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న గిరిజన మినీ గురుకులంలో చదివే విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతము. గురుకులంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు ఒకేసారి ఒక దుప్పటి, కార్పెట్, ప్లేట్లు ఇస్తారు. అదీ 30 మందికి మాత్రమే. 30 దాటితే.. ఆపై విద్యార్థులు సొంతంగా కొనుక్కోవాల్సిందే. దుప్పట్లు.. కార్పెట్లు పొందిన సదరు విద్యార్ధి ఐదో తరగతి చదువు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే వరకు మళ్లీ ఎలాంటి పంపిణీ చేయరు. ఐదేళ్ల వరకు.. వీటిని వరకు కాపాడుకోవడం విద్యార్ధి బాద్యత. ఒకవేళ దుప్పట్లు చిరిగిపోయినా.. ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ సమగ్ర హాస్టల్ గదుల వెంటిలేటర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మెట్పల్లి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు కప్పుకోవడానికి చెద్దర్లు ఉన్నా, అవి చలిని ఆపేంత స్థాయిలో మందంగా లేవు. దీంతో విద్యార్థులు చెద్దర్లను కప్పుకున్నా వణుకుతున్నారు. ధర్మపురి మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదివే విద్యార్థులదీ ఇదే పరిస్థితి. వెల్గటూరు మండంలలోని ఎండపెల్లి గ్రామంలో సాంఘీక సంక్షేమ హాస్టల్లో కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు చలికి ఇబ్బం దులు పడుతున్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం రగ్గులు పంపిణీ చేయలేదు. దీంతో చలి తీవ్రతకు చాలా మంది విద్యార్థులు రాత్రి పూట వారి వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణానికి చెందిన ఓ హాస్టల్వార్డెన్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు త మ పిల్లలను వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అలాంటి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాద్యతా ప్రభుత్వానిదే. వారికి రావల్సిన కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే విద్యార్థులు విద్యలో ముందడుగు వేస్తారు. ’అన్నారు. -
అభివృద్ధి చెందాల్సింది పాలమూరే
సాక్షి, మహబూబ్‌నగర్:తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటగా అభివృద్ధి చెందాల్సిన జిల్లా మహబూబ్‌నగర్ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రేషన్‌కార్డులు, సంక్షేమ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనానికి జనవరి 1నుంచి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరాపై జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అథితిగా మంత్రి రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా అనేక వివక్షలకు గురైందన్నారు. జిల్లా గుండా కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా పంటలకు నీళ్లు పారించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పల్లెల్లో పల్లేర్లు మొలిచాయని, ఇక ముందు పచ్చగా మారేలా చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. సమగ్రకుటుంబ సర్వేపై దుష్ర్పచారంచేశారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రంలో కోటి ఆశలతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం కోసమే సర్వే చేసిందన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు పోతాయంటూ కొందరు విపక్షనేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో 9,95,000 కార్డులు ఉంటే ప్రస్తుతం 10,16,961 ఇస్తున్నామన్నారు. కార్డులోని యూనిట్ల సంఖ్య కూడా ఆరు లక్షల వరకు పెరిగిందని వివరించారు. జిల్లాలో సంక్షేమహాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్నభోజనానికి ప్రతినెల 18,675 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. పాలమూరుకే పెద్దపీట పారిశ్రామికంగా వెనుకబడిన పాలమూరు పెద్దపీట వేస్తామని పరిశ్రమల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి ఖనిజ, అటవీ, సారవంతమైన భూములున్నాయని వాటిని ఉపయోగించుకునే అవకాశం రాలేకపోయిందన్నారు. ఇక నుంచి జిల్లాకు పెద్దపీట వేసి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంబంధించి జిల్లాకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ సెక్రటరీ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో అతి తక్కువ అక్ష్యరాస్యత ఉండడం వల్లే ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ ఫలాలు ప్రకటించినా అభివృద్ధి చెందడం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో అధికారులు తీవ్రంగా శ్రమించి రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లాలని సూచించారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నందున అక్రమాలకు తావివ్వకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తే బాగుంటుందన్నారు. ఆహారభద్రత హక్కు చట్టం కింద గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని, దాని ద్వారా ప్రతి ఒక్కరికీ ఐదు కిలోలు అందనుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటికి అదనంగా ఒక కేజీ చేర్చిందని చెప్పుకొచ్చారు. 2013లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన చట్టాన్నే రాష్ట్రం అమలులో పెడుతోందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలతో గందరగోళం... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కిందట ఆమోదించిన చట్టాన్ని మీరెందుకు అమలు చేయలేదంటూ ఎదురుదాడి చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అట్టడుగు వర్గాలకు అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూటు కాలికింద తొక్కిపెట్టారని నిప్పులు చెరిగారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో వేదిక మీదున్న మంత్రులు జూపల్లి, ఈటెల, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. జిల్లాకే అధిక ప్రాధాన్యం: ఎంపీ జితేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమైన పదవులన్నింటినీ కూడా జిల్లాకు ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లాలో లిప్ట్ ఇరిగేషన్ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాకే వలసలు రానున్నాయన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి కూడా ప్రసంగించారు. ఈ సమావేశంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.