రుణాలకూ ‘బయోమెట్రిక్‌’ | Bio metric for loans | Sakshi
Sakshi News home page

రుణాలకూ ‘బయోమెట్రిక్‌’

Published Sun, Aug 21 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

రుణాలకూ ‘బయోమెట్రిక్‌’

రుణాలకూ ‘బయోమెట్రిక్‌’

 
  • జన్మభూమి కమిటీకి పూర్తి పెత్తనం
  • 3 నుంచి 9 మందికి కమిటి సభ్యులు పెంపు
  • జీఓ నంబర్‌ 18 జారీ 
  • ఆందోళనలో దళితులు
 
 ‘బయోమెట్రిక్‌’ ఈ పేరు వినని వారుండరు. ఎందుకంటే దీని వల్ల పింఛను తీసుకునే అభాగ్యులు, రేషన్‌ షాపుల్లో నిత్యావసరాలు తీసుకునే లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న వారే. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీ రుణాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలోనే సబ్సిడీ రుణాలకూ బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇది తమకు రుణాలు అందకుండా చేసేందుకేనని దళితులు విమర్శిస్తున్నారు. 
నెల్లూరు(సెంట్రల్‌): 
 సబ్సిడీ రుణాలు పేదలకు అందకుండే చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇందులో భాగంగా రుణాల మంజూరులో బయోమెట్రిక్‌ విధానంలో అమల్లోకి తెచ్చింది. అంతేగాక రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలకు పూర్తి పెత్తనం కట్టబెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యులున్న కిమిటీలో ఏకంగా 9 మంది ఉండేటట్లు చేసింది. మొత్తం పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
బయోమెట్రిక్‌తో ఇబ్బందులే 
ఇప్పటికే బయో మెట్రిక్‌ వల్ల పింఛను, రేషన్‌ అందక లబ్ధిదారులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు ఎస్సీ, బీసీ పేదలకు ఇచ్చే రుణాలకు సైతం బయోమెట్రిక్‌ పెట్టడంతో వీరి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విధంగా చంద్రబాబు పాలను చూస్తుంటే దళితులపై కక్ష సాధింపు చర్యగా తెలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
జన్మభూమి కమిటీలో వీరే...
జన్మభూమి కమిటీలో మొత్తం ప్రస్తుతం నియోజక వర్గంలో 3 ఉన్నారు. ఈ ముగ్గురు టీడీపీ నాయకులే.. కాని ఇప్పుడు కొత్తగా ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, 1 ఎంపీపీ, 1 జెడ్పీటీసీలు అంతా కలిసి ఆరు మంది కాగా గతంలో ఉన్న ముగ్గరితో కలిపి మొత్తం 9 మంది కమిటీలో ఉంటారు. అర్హులైన వారికి రుణాలు అందిస్తామని చెపుతున్నా సీఎం చంద్రబాబు సర్కారు ఈ విధంగా అధికార పార్టీకి చెందిన వారిని కమిటీలో నియమిస్తే అర్హులైన అందరికి ఏ విధంగా రుణాలు వస్తాయని పలువురు విమర్శలు చేస్తున్నారు.
 
దళితులను పూర్తిగా మోసం చేయడమే: పందిటి సుబ్బయ్య, ఎస్‌ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ కార్యదర్శి
చంద్రబాబు పాలన చూస్తుంటే ఎవరికి లేని విధంగా దళితులపై కక్ష సాధింపు చర్యలుగా చేపట్టినట్లు ఉంది. ఇచ్చే అరకొర రుణాలకు సైతం బయోమెట్రిక్‌ పెట్టి రుణాలను ఇవ్వకుండా చేయడానికే ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉంది. ముఖ్యంగా మాదిగలపై బాబు సర్కారు కక్ష సాధింపు చేస్తోంది.
 
జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేయాలి: వాదనాల వెంకటరమణ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు
జన్మభూమి కమిటీ సభ్యుల వల్ల చాలా మంది అర్హులైన వారికి రుణాలు అందడం లేదు. దీనికి తోడు 9 మందిని కమిటీ సభ్యులను పెట్టడం అన్యాయం. దళితులకు ఇచ్చే రుణాలను కూడా కమిటీ సభ్యుల వద్దకు వెళ్లి అడుక్కోవాలా.. ఇది ఎక్కడి న్యాయం ..పాలకుల తీరు మారక పోతే కష్టం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement