
సాక్షి, హైదరాబాద్: బయోమెట్రిక్ పనిచేయకపోతే మ్యానువల్ లేదా ఐరిస్‌తో వినియోగదారులకు రేషన్ సరుకులు ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. మంగళవారం పౌరసరఫరాలు, తూనికల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 31 జిల్లాల తూనికలు కొలతల అధికారులకు ల్యాప్‌టాప్‌లు, వాహనాలను ఈటల, సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ అకున్ సభర్వాల్ అందజేశారు. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని, మల్టీప్లెక్స్ మోసాలను కూడా అరికడుతున్నామని ఈటల తెలిపారు.