
న్యూఢిల్లీ: ఆధార్ నమోదు, మార్పులు చేర్పుల దరఖాస్తులపై ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది బయోమెట్రిక్ సంతకం చేసేలా ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త విధానం తీసుకురానుంది. పౌరుల బయోమెట్రిక్, ఇతర కీలక సమాచారం భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే చెప్పారు. ఈ వ్యవస్థ జనవరి కల్లా అమల్లోకిరావచ్చు. ఆధార్ దరఖాస్తు స్వీకరించగానే సంబంధిత సిబ్బంది దానిపై బయోమెట్రిక్ సంతకం చేయాలి. ఇప్పుడు అధీకృత ప్రైవేట్ ఆపరేటరే దరఖాస్తుపై సంతకం చేస్తున్నారని ఇకపైప్రభుత్వ, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది దానిపై బయోమెట్రిక్ రూపంలో కౌంటర్ సంతకం చేస్తారు.