
బయోమెట్రిక్..!
• సబ్సిడీ శనగ విత్తనాల కోసం పాట్లు
• భూ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటేనే విత్తనాలు
• వేలిముద్రలు పడకపోతే అంతే సంగతులు
• {పభుత్వ నిర్ణయంపై రైతుల ఆందోళన
• సర్వర్ పని చేయక అవస్థలు
• బ్యాగుల తూకంలోనూ మాయూజాలం
సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీలో ప్రభుత్వం ట్రిక్స్ ప్లే చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నారుు. నిబంధనలను సాకుగా చూపి తమకు విత్తనాలు అందకుండా చేస్తోందని రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటేనే విత్తనాలు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం రైతులకు మింగుడు పడటం లేదు. బయోమెట్రిక్ పద్ధతి ద్వారా విత్తనాలను పొందాలంటే భూవివరాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉండాలి.
సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో ఎక్కువ మొత్తంలో భూ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో వీరికి సబ్సిడీ విత్తనాలు అందడం కష్టంగా మారింది. ఇక వేలిముద్రలు సరిపోలక పోరుునా, ఇతర సాంకేతిక సమస్యలు ఉత్పన్నైమైనా విత్తనాలు లభించే అవకాశం లేదని వ్యవసాయాధికారులే అంగీకరిస్తున్నారు. ఈ పద్దతి ద్వారా 30-40 శాతం వరకు రైతులు విత్తనాలు పొందే అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది తెలిసే ప్రభుత్వం బయోమె‘ట్రిక్’కు తెరతీసిందని రైతులు చర్చించుకుంటున్నారు.
పర్చూరు: శనగ పంట సాగు సీజన్ సమీపించడంతో నవంబరు 15వ తేదీ వరకు బయోమెట్రిక్ పద్ధతిలో సబ్సీడీపై విత్తనాలను పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో సబ్సీడీ విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులు తమకు విత్తనాలు దక్కవేమోనని ఆందోళన చెందుతున్నారు. బయోమెట్రిక్ పనిచేయక సమస్యలు తలెత్తున్నారుు. గతంలో 5 ఎకరాలు ఉంటే 125 కేజీలు ఇచ్చేవారు. ప్రస్తుతం 75 కేజీలు మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 కేజీలు అవసరం. కానీ ప్రభుత్వం 25 కేజీలు చొప్పున ఇస్తుంటే, మిగిలిన శనగలను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయూల్సిన పరిస్థితి నెలకొంటోంది.
25 కిలోల బ్యాగులో 19 కిలోల విత్తనాలే..
పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన రైతులు తోకల సుబ్బారావు కు శనగల పంపిణీ చేయగా, అందులో 25 కేజీల బ్యాగు గాను, 19 కేజీలు మాత్రమే విత్తనాలు ఉన్నారుు. మరొక రైతు గోరంట్ల వెంకట నారాయణకు ఇచ్చిన బ్యాగుళో 22.9 కిలోలే ఉంది. ఇలా తూకం తక్కువగా రావడం వంటి సమస్యలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు సరిపడా విత్తనాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. పర్చూరు సబ్‌డివిజన్ పరిధిలో 14 వేల క్వింటాళ్లు అడుగగా, 9 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని ఏడీఏ కన్నయ్య తెలిపారు.
చుక్కలంటుతున్న శనగల ధరలు...
శనగ విత్తనాలకు బ్లాక్ మార్కెట్ ధరలు చుక్కలంటుతున్నాయి. నాణ్యత కలిగిన విత్తనాలంటూ క్వింటా రూ. 10 వేల వరకు ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం 40 శాతం సబ్సిడీపై కిలో రూ. 59.20కు పంపిణీ చేసే శనగ విత్తనాల కోసం రైతులు పోటీ పడుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా రైతులందరికీ విత్తనాలు అందజేయాలని కోరుతున్నారు.
సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
పర్చూరు సబ్ డివిజన్ పరిధిలో సాధారణ సాగు విస్తీర్ణం సుమారుగా 15 వేల హెక్టార్లు ఉన్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. పర్చూరు సబ్ డివిజన్ పరిధిలోని పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లోనే సుమారు 20 వేల హెక్టార్లలో పంట సాగవుతోంది. ఆరు నెలలుగా పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతో గతేడాది కన్నా 5-6 వేల హెక్టార్లు సాగు విస్తీర్ణం పెరగ వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులందరికీ పంపిణీ చేస్తాం
బయోమెట్రిక్ పద్దతి ద్వారా శనగ విత్తనాల పంపిణీలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా అర్హులందరికీ దక్కెలా చర్యలు చేపడతాం. రైతులు ఆందోళన చెందవద్దు. - శివనాగప్రసాద్, ఏవో, పర్చూరు