సాక్షి, కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వ వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యే విధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దొడ్డిదారులు వెతుక్కుంటూ డుమ్మా కొడుతున్నారు. హాజరు పట్టీలో సంతకాలు పెట్టడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని బయోమెట్రిక్ విధానం తీసుకువస్తే దానికి కూడా కొందరు వైద్యులు అడ్డదారులు వెతికారు.
ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని 12 మంది వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ఇతరులచే బయోమెట్రిక్ వేయించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వేలిముద్రలతో రబ్బర్ తొడుగులను తయారు చేయించి విధులకు హాజరు కాకుండా ఇతరులచే బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించినట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. దొడ్డి దారిన హాజరు వేసిన 12 మంది వైద్యులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. వీరిపై శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment