ఎస్కేయూ:
వర్సిటీలోని పలు విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఆధార్‌తో అనుసంధానం చేసిన బయోమెట్రిక్ మిషన్లు ద్వారా హాజరు నమోదు చేయాలని ఉన్నత విద్యా మండలి గతేడాది ఆదేశాలు జారీ చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాలంటే ప్రతి విభాగంలోనూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీంతో 2016 అక్టోబర్‌లో 35 బయోమెట్రిక్ పరికరాలను రూ.3.15 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు ఒకే సర్వర్‌ను అనుసంధానం చేయడంతో బయోమెట్రిక్ పరికరాలు పనిచేయలేదు. ప్రతి బయోమెట్రిక్ పరికరానికి ఏయిర్‌టెల్ సిమ్‌లను అటాచ్‌చేశారు. దీంతో ఇవి పనిచేసినా, చేయకున్నా ప్రతి నెలా వేలాది రూపాయలు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. 2013లోనూ బయోమెట్రిక్ పరికరాలు కొనుగోలు చేసినప్పటికీ అవి పనిచేయలేదు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేయడంతో తిరిగి గతేడాది 35 పరికరాలను కొనుగోలు చేశారు. ఇవి కూడా పనిచేయడంలేదు.