అనంతపురం అగ్రికల్చర్ : సూక్ష్మసాగు (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాల మంజూరు ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ఈ సారి బయోమెట్రిక్, బార్‌కోడింగ్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. బార్‌కోడింగ్ పరికరాలు ఇప్పటికే తెప్పించామన్నారు.
త్వరలోనే బయోమెట్రిక్ పరికరాలు ఏపీఎంఐపీ కార్యాలయంతో పాటు మీసేవా కేంద్రాలు, డ్రిప్ కంపెనీల వద్ద అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అర్హులకు సకాలంలో యూనిట్లు మంజూరు చేయడానికి సులభంగా ఉంటుందన్నారు. మే రెండో వారం నుంచి డ్రిప్ యూనిట్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. యూనిట్లు తీసుకుని ఏడేళ్లు పూర్తయిన రైతులు రెండోసారి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
అమలులోకి బయోమెట్రిక్, బార్‌కోడింగ్
Published Mon, Apr 24 2017 12:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement