
న్యూఢిల్లీ: రేషన్ కార్డు లేని వారికి సైతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే నిత్యావసరాలను సరఫరా చేసే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డు అయినా యావత్ దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇది విధానపరమైన విషయమనీ, భారత ప్రభుత్వం ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది.
‘సెంట్రల్ విస్టా’పై స్టేకు నో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్, కేంద్రప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ‘కోవిడ్ సంక్షోభ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు’అంటూ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment