essential goods supply
-
నిత్యావసర సరుకులపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
-
వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. వారానికిపైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఈ సరుకులు పంపిణీ చేయనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా వాయుగుండం ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీటి మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదవండి: శాంతించిన తమ్మిలేరు, ఏలేరు -
త్వరలో షూటింగ్స్‌కి అనుకూలంగా జీవో
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సీఎం కేసిఆర్‌గారు కూడా పరిశ్రమ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. త్వరలోనే సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయికిరణ్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్ మాట్లాడుతూ –‘‘తెలంగాణాను సాధించటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కేసిఆర్‌గారు నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తలసాని శ్రీనివాస్ గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమానూ తొలి రోజే చూస్తారు. చిరంజీవి, నాగార్జున, మిగతా అసోషియేష¯Œ ్స అంతా కలిసి లీడ్ తీసుకుని సినిమాల చిత్రీకరణ గురించి మాట్లాడటానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. సీసీసీ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటాం’’ అన్నారు. నిర్మాత అభిషేక్ నామా కూడా పాల్గొన్నారు. -
కార్డు లేని వారికీ రేషన్
న్యూఢిల్లీ: రేషన్ కార్డు లేని వారికి సైతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే నిత్యావసరాలను సరఫరా చేసే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డు అయినా యావత్ దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇది విధానపరమైన విషయమనీ, భారత ప్రభుత్వం ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ‘సెంట్రల్ విస్టా’పై స్టేకు నో సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్, కేంద్రప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ‘కోవిడ్ సంక్షోభ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు’అంటూ వ్యాఖ్యానించింది. -
ఆర్థిక వ్యవస్థపై దెబ్బ తగిలినా.. ప్రజల ప్రాణాలే..
సాక్షి, అమరావతి : కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మంగళవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్ రెడ్డి,నలంద విద్యాసంస్థలు..పేదలకు ఏర్పాటు చేసిన నిత్యావసర కిట్స్ వాహనాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాకు ముందు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థపై దెబ్బ తగిలినా.. ప్రజల ప్రాణాలే మిన్న అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారని ఆయన తెలిపారు. (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు) ప్రజలకు సేవ చేసేందుకు ప్రజా ప్రతినిధులు కూడా ముందుకు రావాలని సూచించారు. వైద్యులు, వాలంటీర్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని,అందరూ ముందుకు వచ్చి సేవ చేయడానికి ముందుండాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ సందర్బంగా ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరిమండ వరప్రసాద్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ రేషన్ ఇచ్చినట్లే తాము కూడా నిత్యావసరాలు పంచుతున్నామని తెలిపారు. చాలా మంది పేదలకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అందుకే వారికి ఈ కిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. (కష్టాల్లో ఉన్నారు.. తీసుకురండి ) -
నిత్యావసరాల పంపిణీపై నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ ప్రకటించడంతో వైద్యులు, సిబ్బందికి రక్షణ పరికరాలు–మందులు, ప్రజలకు ఆహారం–నిత్యావసర వస్తువులు, క్వారంటైన్లో ఉన్న వారికి కల్పిస్తున్న సౌకర్యాలు తదితరాలపై నివేదిక అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 9వ తేదీ గురువారం నాటికి మధ్యంతర నివేదిక ఇవ్వాలని, పూర్తి నివేదికను ఈ నెల 15లోగా అందజేయాలని ఆదేశిం చింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఇంకా ఎంత మేరకు అవసరం ఉంటాయి, వాటికోసం తీసుకున్న చర్యల గురించి నివేదికలో వివరించాలని కోరింది. నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇక ముందు అవసరమైన సరుకుల గురించి కూడా మధ్యంతర నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ.. విదేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్స్లో సౌకర్యాలు కల్పించాలని, వైద్యం అందిస్తున్న సిబ్బందికి వైద్య రక్షణ పరికరాలు అందజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన ప్రజాహి త వ్యాజ్యాన్ని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ తరఫు న్యా యవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ప్రాణాలను ఫణం గా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వారికి వైద్య రక్షణ పరికరాలు అందజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎన్ 95 మాస్క్ లు, గ్లౌజ్‌లు, శానిటైజ ర్లు, వ్యక్తిగత వైద్య రక్షణ పరికరాలు తగినంతగా లేవని, వీటి తయారీకి లేదా దిగుమతికి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని సూచించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వీధి పిల్లలు, అనాథలు, వసతి గృహాల్లోని వారు, తెల్లరేషన్ కార్డు లేని వారు, వలస కార్మికులకు వారి వద్దకే నిత్యావసర వస్తువులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను కఠినంగా అమలు చేస్తోందని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ చెప్పారు. కరోనాకు సంబంధించిన ఇతర కేసులు, న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం వద్ద ఉన్న కేసుల్ని కూడా ఒకే ధర్మాసనం విచారిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఏజీ కోరారు. దీంతో అన్ని కేసుల్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనమే విచారిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అన్ని కేసుల్ని తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. -
పారిశద్ధ్య కార్మికులకు అండగా ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో 7500 పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.15 వేల మంది వాలంటీర్లకు శానిటైజర్లు,మాస్క్‌లను తమ ట్రస్ట్ తరపున పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో విశాఖలోని పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’ వారికి వెయ్యి రుపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రగతి భారత్ ఫౌండేషన్‌కు గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు. (రజినీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్) ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పారిశుద్య కార్మికులకు కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు అందివ్వబోతున్నట్లు వెల్లడించారు. పోలీసులకు, హోంగార్డులకు, జర్నలిస్టులకు సైతం ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందించనున్నామన్నారు. విశాఖలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి ట్రస్ట్ తరపున భోజన సదుపాయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తక్కువ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్డ్రంలోని నిరుపేద కుటుంబాలని ఆదుకుంటున్నారని ప్రశంసించారు. (పీఎం కేర్స్‌కు యువీ విరాళం ) భౌతిక దూరంతో కరోనాను నియంత్రించగలం లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం పిలుపుకి స్వచ్చంద సేవా సంస్థలు స్పందించి.. పేదలని ఆదుకోవడానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. బౌతిక దురాన్ని పాటించడం ద్వారా కరోనా నియంత్రించగలమన్నారు. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడం హర్షనీయమన్నారు. లాక్డౌన్ కాలంలో వీరికి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రగతి భారత్ ఫౌండేషన్‌ను అభినందించారు. ప్రభుత్వం తరపున కూడా అండగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ప్రశంసించారు. (కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్) -
ఫిల్మ్ జర్నలిస్టుల కోసం అండగా...
కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ఫిల్మ్ జర్నలిస్టులకు ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’(టీఎఫ్జేఏ) అండగా ఉంటుందని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 35 మంది ఫిల్మ్ జర్నలిస్టులకు టీఎఫ్జేఏ ఆధ్వర్యంలో 30 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రెస్‌మీట్స్‌కి హాజరయ్యే విలేకరులకు, ఫొటో, వీడియో జర్నలిస్టులకు టీఎఫ్జేఏ అండగా ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనేది సంస్థ ముఖ్యోద్దేశం. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులు టీఎఫ్జేఏని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
పామాయిల్‌కు మంగళం
►చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ►సబ్సిడీ భారం భరించని సర్కార్ ►పేదలకు ఇక పామాయిల్ లేనట్లే అనంతపురం అర్బన్ : పేదలకు చౌకదుకాణాల ద్వారా అందే పామాయిల్ ఇక లేనట్లే. సబ్సీడీ భారమని ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దారిద్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నాయి. రేషన్‌కార్డుల లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే నిత్యావసర సరుకులలో బియ్యం, కిరోసిన్, గోధుమ పిండి పంపిణీలో 70 శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించగా.. 30 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. బియ్యం, కిరోసిన్, గోధుమ పిండి, పామాయిల్, పసుపు, చక్కెర, ఉప్పు, కారంపుడి లాంటి నిత్యావసర సరుకులు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పేద ప్రజలకు సరఫరా చేసేవి. అయితే.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని రాయితీలు భరించలేక కేవలం బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమ పిండి మాత్రమే సరఫరా చేస్తోంది. పేదలకు ఎంతో అవసరమైన పామాయిల్‌కు మాత్రం మంగళం పాడింది. సబ్సిడీతో కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులేత్తిసింది. పామాయిల్ దిగుమతి ఇలా.. గత కాంగ్రెస్ప్రభుత్వం పామాయిల్ దిగుమతిని విరివిగా చేసింది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌ల్యాండ్ దేశాల నుండి సముద్రపు ట్యాంకర్ల ద్వారా దేశానికి పామాయిల్‌ను దిగుమతి చేసింది. రాష్ట్ర కోటాలో భాగంగా ట్యాంకర్ల ద్వారా పామాయిల్‌ను వైజాగ్, కాకినాడ ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలకు చేరేది.. అక్కడ విజయ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో ప్యాకెట్లుగా తయారు చేసి సబ్సిడీ ద్వారా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసేది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ ప్యాకెట్ ధర రూ. 56 నుండి రూ. 60ల వరకు ఉండగా.. ప్రభుత్వం సబ్సిడీతో కార్డు లబ్ధిదారులకు రూ. 45లకు పంపిణీ చేసేది. నెలకు ఒక పామాయిల్ ప్యాకెట్ చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయడంతో పేదలకు ఎంతోకొంత ఊరటగా ఉండేది. కరువు జిల్లాపై తీవ్ర ప్రభావం : బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర రూ. 66 నుండి రూ. 70ల వరకు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో పేద ప్రజలు పామాయిల్‌ను కొనే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న 10,09,607 మంది కార్డు లబ్ధిదారులకు గతంలో ఒక్కొక్క కార్డు లబ్ధిదారునికి ఒక పామాయిల్ ప్యాకెట్ వచ్చేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి చేసుకోవడానికి బడ్జెట్‌పై ప్రభావం పడుతోందని సాకుతో పేద ప్రజలకు పామాయిల్‌ను అందని ద్రాక్షలా చేసింది.