సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. వారానికిపైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఈ సరుకులు పంపిణీ చేయనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా వాయుగుండం ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీటి మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదవండి: శాంతించిన తమ్మిలేరు, ఏలేరు
Comments
Please login to add a commentAdd a comment