సాక్షి, అమరావతి : కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మంగళవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్ రెడ్డి,నలంద విద్యాసంస్థలు..పేదలకు ఏర్పాటు చేసిన నిత్యావసర కిట్స్ వాహనాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాకు ముందు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థపై దెబ్బ తగిలినా.. ప్రజల ప్రాణాలే మిన్న అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారని ఆయన తెలిపారు.
(ట్రంప్ టీంలో మన దిగ్గజాలు)
ప్రజలకు సేవ చేసేందుకు ప్రజా ప్రతినిధులు కూడా ముందుకు రావాలని సూచించారు. వైద్యులు, వాలంటీర్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని,అందరూ ముందుకు వచ్చి సేవ చేయడానికి ముందుండాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ సందర్బంగా ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరిమండ వరప్రసాద్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ రేషన్ ఇచ్చినట్లే తాము కూడా నిత్యావసరాలు పంచుతున్నామని తెలిపారు. చాలా మంది పేదలకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అందుకే వారికి ఈ కిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. (కష్టాల్లో ఉన్నారు.. తీసుకురండి )
Comments
Please login to add a commentAdd a comment