
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తమిళనాడు అధికార అన్నాడీఎంకే ఎంపీలు మద్దతివ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు.
నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించేందుకు, కావేరీ జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సరైన రీతిలో నిరసన తెలిపేందుకు అవిశ్వాసానికి మద్దతివ్వాలని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.