తిరువొత్తియూరు(చెన్నై): చెన్నై విమానాశ్రయం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంటిలో బాంబు పెట్టినట్లు బెదిరింపు సమాచారం ఇచ్చిన తిరునల్వేలికి చెందిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి విమానాశ్రయం, సీఎం ఇంటికి బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడు.
దీంతో పోలీసులు సీఎం ఇంటితో పాటు విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీ చేశారు. అక్కడ బాంబు లేదని తెలిసింది. తప్పుడు సమాచారం ఇచ్చిన తిరునల్వేలి జిల్లా సుందమల్లి గ్రామానికి చెందిన తామరై కన్నన్ (25)ను ఫోన్ కాల్ ఆధారంగా అరెస్టు చేశారు. తామరై కన్నన్ ఆకతాయితనంతో బాంబు పెట్టినట్లు ఫోన్ చేశాడని తేలింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకొచ్చి విచారిస్తున్నారు.
చదవండి: Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం.. విజయ లక్ష్మి ఏం చేసిందంటే..?
Comments
Please login to add a commentAdd a comment