సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి క్రికెట్ ఆడారు. కరుణానిధి క్రికెట్ ఆడటమేంటీ అనుకుంటున్నారా.. అయితే ఆయన ఆడింది గ్రౌండ్‌లో కాదు.. తన ఇంట్లో.. అది కూడా మునిమనవడితో కావడం విశేషం. కరుణానిధి వీల్ ఛైర్‌లో కూర్చొని బౌలింగ్ చేస్తుంటే.. తన 2 ఏళ్ల ముని మనవడు( అరుల్‌నిధి కుమారుడు) బ్యాటింగ్ చేశాడు. ప్లాస్టిక బాల్, బంతితో తాత మనవడు క్రికెట్ ఆడుతుండగా కుటుంబ సభ్యులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు వస్తున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడంతో ఆయన అభిమానులు, పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ నేత అరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం కరుణానిధి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుమారుడు స్టాలిన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment