
తిరుత్తణి: ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదినమైన మార్చి1వ తేదీన తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరాన్ని కానుకగా అందజేయనున్నట్లు డీఎంకే జిల్లా కన్వీనర్ భూపతి తెలిపారు. తిరుత్తణిలో ఆదివారం డీఎంకే జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో కన్వీనర్ భూపతి, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జన్మదినం రోజున భారీగా వేడుకలు నిర్వహించి పేదలకు సహాయకాలు పంపిణీ చేయాలని సూచించారు.
మరో ఘటనలో..
కయోజెనిక్ ఇంజిన్ ప్రయోగం విజయవంతం
సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లా మహేంద్ర గిరి ఇస్రో కేంద్రంలో ఆదివారం క్రయోజెనిక్ ఇంజిన్ ప్రయో గం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఇస్త్రో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ. 10 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2023లో అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఉపయోగించే క్రయోజెనియ్ ఇంజిన్‌ను మహేంద్రగిరిలోని ఇస్రో కేంద్రంలో రూపొందించి పరీక్షిస్తున్నారు. సీఈ –20 పేరిట సిద్ధం చేసిన ఈ ఇంజిన్‌ను ఇప్పటికే మూడు విడతలుగా పరీక్షించినట్లు వెల్లడించారు. తాజాగా నాలుగో విడతలో 100 సెకన్ల పాటూ ఈ ఇంజిన్ పనితీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment